Gold Prices today: బంగారం నగలు కొనాలి అనుకుంటున్నారా... ఇప్పటికైనా మంచిపోయింది లేదు... ఇప్పుడే కొనుక్కోండి... ఓ నాల్రోజుల తర్వాతైతే... ధరలు పెరగవచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఇందుకు ప్రధాన కారణంగా కరోనా కనిపిస్తోంది. ఇండియాలో కేసులు తగ్గుతున్నా... ప్రపంచ దేశాల్లో బాగా పెరుగుతున్నాయి. ఇదే కంటిన్యూ అయితే... మళ్లీ విదేశాల నుంచి కొత్త వేరియంట్లు ఇండియాలోకి ప్రవేశించగలవు. అప్పుడు మళ్లీ ఇండియాలో కరోనా విజృంభించే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే... ఇన్వెస్టర్లు... సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా బంగారాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడే నగలు కొనుక్కోవడం మేలంటున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6 నెలల లెక్క చూస్తే... జనవరి 2న 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు ధర రూ.46,900 ఉంది. ఇప్పుడు రూ.44,200 ఉంది. అంటే... 6 నెలల్లో ధర రూ. 2,700 తగ్గింది. అదే 24 క్యారెట్ల పెట్టుబడి బంగారం 10 గ్రాములు జనవరి 2న రూ.51,170 ఉండగా... ఇప్పుడు రూ.48,220 ఉంది. అంటే... 6 నెలల్లో ధర రూ.2,950 తగ్గింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే 6 నెలలుగా బంగారంపై పెట్టుబడి పెట్టినవారికి నష్టమే మిగిలినట్లు లెక్క. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,822 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.38,576 ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,220 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.220 పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ జిల్లాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 3-7-2021: వెండి ధర గత 10 రోజుల్లో 4 సార్లు తగ్గగా... 4 సార్లు పెరిగింది. 2 సార్లు స్థిరంగా ఉంది. నిన్న కొద్దిగా తగ్గింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.73.90 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.591.20 ఉంది. అదే 10 గ్రాములు కావాలంటే... ధర రూ.739 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,390 ఉండగా... కేజీ వెండి ధర... రూ.73,900 ఉంది. నిన్న కేజీకి రూ.200 తగ్గింది. గత 6 నెలల్లో అంటే... జనవరి 2న వెండి ధర కేజీ రూ.76,600 ఉంది. ఇప్పుడు రూ.73,900 ఉంది. 6 నెలల్లో వెండి ధర కేజీకి రూ.2,700 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: ఈ వారం స్టాక్ మార్కెట్లు ఊగిసలాట మధ్యే కొనసాగాయి. అంతకుముందువారం వీకెండ్ నాటికి నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారం మాత్రం లాభాల్లో ముగిశాయి. వచ్చేవారం కూడా పాజిటివ్ కోణంలోనే ఉంటాయని అంటున్నారు. ఇండియాలో కరోనా కేసులు పెరగకుండా ఉంటే... స్టాక్ మార్కె్ట్లకు విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FII), దేశీయ సంస్థాగత పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందనీ... తద్వారా స్టాక్ మార్కెట్లు సరికొత్త మైలురాళ్లను అధిగమించగలవు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంచి పేరున్న కంపెనీల షేర్లు మాత్రమే కొనుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)