దేశీ మార్కెట్లో బంగారం ధరలపై ప్రభావం చూపే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లను గమనిస్తే.. బంగారం ధర భారీగా పడిపోయింది. ఔన్స్‌కు 1.04 శాతం మేర దిగి వచ్చింది. దీంతో ఔన్స్ పసిడి రేటు 1648 డాలర్లకు క్షీణించింది. ఇక వెండి రేటు కూడా ఔన్స్‌కు 1.38 శాతం పడిపోయింది. ఔన్స్‌కు 19.22 డాలర్లకు దిగి వచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్లో కూడా అదే ట్రెండ్ కొనసాగింది. పసిడి రేట్లు నేలచూపులు చూస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా డాలర్ నెల రోజుల కనిష్ట స్థాయి నుంచి పైకి కదిలింది. దీంతో పసిడిపై ప్రభావం పడిందని తెలియజేస్తున్నారు. అంతేాకాకుండా వచ్చే వారంలో ఫెడ్ మినిట్స్ వెల్లడి కానున్నాయి. దీంతో గోల్డ్ ట్రేడర్లు కూడా ఆచీతూచీ వ్యవహరిస్తున్నారని వివరించారు.