Gold Rate today: బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఇది సరైన సమయమే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఎందుకంటే.. జులై 1 నుంచి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.50వేలకు చేరువలో ఉన్నాయి. ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లతో యుద్ధం వస్తే... బంగారం ధరలు భారీగా పెరుగుతాయనే అంచనా ఉంది. అలాగే.. ఇండియాలో థర్డ్ వేవ్ వస్తే కూడా పసిడి ఆకాశానికి చేరుకుంటుందని అంటున్నారు. సామాన్యులకు మాత్రం నగలు కొనుక్కునే పరిస్థితి లేకుండా ఇబ్బంది కలగవచ్చని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 25-7-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,470 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,760 ఉంది. నిన్న 8 గ్రాముల ధరలో మార్పు లేదు. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,700 ఉంది. నిన్న 10 గ్రాములు ధర స్థిరంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,877 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.39,016 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధరలో మార్పు లేదు. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,770 ఉంది. నిన్న 10 గ్రాములు ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 25-7-2021: వెండి ధర మళ్లీ తగ్గింది. గత 10 రోజుల్లో 5 సార్లు తగ్గగా... 4 సార్లు పెరిగింది. 1 సారి స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.72 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.576 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.720 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,200 ఉండగా... కేజీ వెండి ధర... రూ.72,000 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.300 తగ్గింది. జూన్ 30న వెండి ధర కేజీ రూ.72,900 ఉంది. ఇప్పుడు రూ.72,000 ఉంది. అంటే ఈ 23 రోజుల్లో వెండి ధర రూ.900 తగ్గినట్లు లెక్క. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిళ్లు: గత వారం స్టాక్ మార్కెట్లు గురు, శుక్ర వారాల్లో భారీ లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఈక్విటీ షేర్లను కొన్నారు. ఐతే... రేపు సోమవారం ప్రాఫిట్ బుకింగ్ కోసం తిరిగి అమ్మకాలకు సిద్ధపడే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా... కొన్ని చిన్న కంపెనీల షేర్లు లాభాల్లోకి వెళ్తున్నట్లు కనిపిస్తూనే... సడెన్‌గా నష్టాల్లోకి కూడా జారుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి. షేర్లు కొనేటప్పుడు బ్యాంకింగ్, ఆయిల్, ఫార్మా ఇలా... ఒకే రంగానికి చెందిన కంపెనీల షేర్లే అన్నీ కొనేయకుండా... వేర్వేరు రంగాలకు చెందినవి కొనుక్కోవడం మేలంటున్నారు. అలా చేస్తే... ఏదైనా రంగం నష్టాల్లోకి జారుకున్నా.. మిగతా రంగాల షేర్లు ఆ నష్టాలను భర్తీ చేస్తాయని అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)