Gold Prices today: బంగారం ధరలు వరుసగా 10 రోజులు తగ్గిన తర్వాత... నిన్న మళ్లీ కొద్దిగా పెరిగాయి. ఐతే... కంటిన్యూగా పెరిగే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. దేశంలో బంగారు నగల కొనుగోళ్లు ఒక్కసారిగా భారీగా పెరగడంతో... మళ్లీ ధర కొద్దిగా పెరిగింది. ఐతే... ధర మరింత తగ్గే అవకాశాలే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇండియాలో కరోనా పెరిగితేనే ధర పెరుగుతుందనీ... కరోనా కేసులు తగ్గుతూ ఉంటే... ధర కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అటు క్రిప్టో కరెన్సీ విలువ బాగా పడిపోతోంది అందువల్ల స్టాక్ మార్కెట్లకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
జూన్ 11న 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు ధర రూ.46,100 ఉంది. ఇప్పుడు రూ.44,100 ఉంది. అంటే... 10 రోజుల్లో ధర రూ.2,000 తగ్గింది. అదే 24 క్యారెట్ల పెట్టుబడి బంగారం 10 గ్రాములు జూన్ 11న రూ.50,300 ఉండగా... ఇప్పుడు రూ.48,110 ఉంది. అంటే... 10 రోజుల్లో ధర రూ.2,190 తగ్గింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Prices 23-6-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,410 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,280 ఉంది. నిన్న తులం ధర రూ.160 పెరిగింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,100 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.200 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,811 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.38,488 ఉంది. నిన్న తులం ధర రూ.176 పెరిగింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,110 ఉంది. నిన్న ధర రూ.220 పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 23-6-2021: వెండి ధర గత 10 రోజుల్లో 6 సార్లు తగ్గగా... 1 సారి పెరిగింది. 3 సార్లు స్థిరంగా ఉంది. నిన్న కొద్దిగా తగ్గింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.73 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.584 ఉంది. నిన్న 8 గ్రాములు ధర 0.80 తగ్గింది. అదే 10 గ్రాములు కావాలంటే... ధర రూ.730 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,300 ఉండగా... కేజీ వెండి ధర... రూ.73,000 ఉంది. గత 6 నెలల్లో అంటే... డిసెంబర్ 23న వెండి ధర కేజీ రూ.70,500 ఉంది. ఇప్పుడు రూ.73,000 ఉంది. 6 నెలల్లో వెండి ధర కేజీకి రూ.2,500 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయి?: చూడ్డానికి స్టాక్ మార్కెట్లు జోరందుకున్నట్లు కనిపిస్తున్నా... కరెక్షన్ సంకేతాలు బాగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు ఈక్విటీల్లో కాకుండా... మ్యూచువల్ ఫండ్స్ అందులోనూ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లలో పెట్టుబడి పెట్టుకోవడం మేలంటున్నారు నిపుణులు. స్టాక్ మార్కెట్లలో కుదుపులు ఉండే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. క్రిప్టోకరెన్సీల పతనం కలిసొచ్చేలా ఉన్నా... జాగ్రత్తగా వ్యవహరించకపోతే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. అందువల్ల ఇన్వెస్టర్లు లోతుగా అధ్యయనం చేసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏ స్టాక్ కొన్నా... దాని ఐదేళ్ల పెర్ఫార్మె్న్స్ చూసి... బాగానే ఉంది అనిపిస్తేనే తీసుకోవడం మేలంటున్నారు. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టాలే తప్ప స్వల్పకాలికంగా పెడితే నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)