Gold Rate today: సామాన్య ప్రజలు ఏం ఊహించారో అదే జరిగింది. బిట్‌కాయిన్ విలువ అడ్డంగా పడిపోయింది. గత నెలలో ఈ క్రిప్టోకరెన్సీ విలువ 40 శాతం తగ్గింది. ఫలితంగా ఇప్పుడీ కాయిన్ విలువ రూపాయితో పోల్చితే... రూ.23,72,421 ఉంది. ఇదే కాయిన్ ఏప్రిల్‌లో రూ.45 లక్షలకు కూడా వెళ్లింది. దీని విలువ పడిపోవడంతో... ఈ పెట్టుబడులను బంగారం, స్టాక్ మార్కెట్ వైపు మళ్లిస్తున్నారు. అందువల్ల స్టాక్ మార్కెట్లు జోరందుకుంటున్నాయి. బంగారం ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంగారం నగల కొనుగోళ్లు కూడా పెరిగాయి కాబట్టి... డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం కూడా ధరలు పెరగొచ్చు అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 19-7-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,499 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,992 ఉంది. నిన్న 8 గ్రాముల ధర రూ.8 తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,990 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.10 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,900 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.39,200 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధర రూ.8 తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.49,000 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.10 తగ్గింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 19-7-2021: వెండి ధర 10 రోజుల్లో 5 సార్లు తగ్గగా... 3 సార్లు పెరిగింది. 2 సార్లు స్థిరంగా ఉంది. నిన్న ధర స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.73.20 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.585.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.732 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,320 ఉండగా... కేజీ వెండి ధర... రూ.74,200 ఉంది. నిన్న కేజీ వెండి ధరలో మార్పు లేదు. జూన్‌లో వెండి ధర కేజీకి రూ.3,900 పెరిగింది. జూన్ 30 నాటికి వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.73,200 ఉంది. అంటే ఈ 18 రోజుల్లో వెండి ధర రూ.3,600 తగ్గినట్లు లెక్క. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్స్: ఈ వారంలో బక్రీద్ సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంది. అందువల్ల ఇవాళ, రేపు మార్కెట్లలో షేర్ల కొనుగోళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఐతే... మంగళవారం మధ్యాహ్నం నుంచి అమ్మకాలు పెరిగి... నష్టాల్లోకి జారుకోవచ్చనే అంచనా ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 3నెలల కాలానికి తమ పనితీరు ఎలా ఉందో కార్పొరేట్ కంపెనీలు ఈ వారంలో ఫలితాలు ఇస్తాయి. అందువల్ల ఆ ఫలితాలను బట్టీ మార్కెట్లు ప్రభావితం అవుతాయి. ఐతే... మొదటి త్రైమాసికం అంత గొప్పగా ఏమీ లేదు కాబట్టి... స్టాక్ మార్కెట్లు కూడా అంత బాగా దూసుకెళ్లవు అనే అంచనా ఉంది. స్టాక్ మార్కెట్ బ్రోకర్లు మరేం పర్లేదంటూ పెట్టుబడులు పెట్టేయమని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్లెప్పుడూ పాజిటివ్ గానే ఆలోచిస్తారు కానీ... అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకోకుండా పెట్టుబడులు పెడితే ఇన్వెస్టర్ నష్టపోయే ప్రమాదమూ ఉంటుంది. ఒక పాజిటివ్ అంశం ఏంటంటే... వర్షాలు పడుతున్నాయి. అందువల్ల దేశంలో అభివృద్ధి పెరుగుతుంది. అందువల్ల స్టాక్ మార్కెట్లలో కొద్దిగా జోరు ఉంటుంది. (image credit - twitter - reuters)