Gold Prices today: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అందువల్ల బంగారంపై పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. ఇండియాలో కేసులు ఇంకా పూర్తిగా తగ్గకపోవడం... వచ్చే నెలలో థర్డ్ వేవ్ వస్తుందనే అంచనాలు.. మళ్లీ బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. బంగారం నగల కొనుగోళ్లు జోరుగా ఉన్నాయి. డిమాండ్ పెరుగుతుంటే ధర కూడా పెరుగుతోంది. అటు వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్ ధర బాగా పడిపోతోంది. అందువల్ల బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ.74.91 ఉంది. డాలర్ విలువ పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Prices 17-7-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,525 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.36,200 ఉంది. నిన్న 8 గ్రాముల ధర రూ.80 పెరిగింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.45,250 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.100 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,937 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.39,496 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధర రూ.88 పెరిగింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.49,370 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.110 పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 17-7-2021: వెండి ధర 10 రోజుల్లో 5 సార్లు తగ్గగా... 3 సార్లు పెరిగింది. 2 సార్లు స్థిరంగా ఉంది. నిన్న ధర కొద్దిగా తగ్గింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.74.30 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.594.40 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.743 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,430 ఉండగా... కేజీ వెండి ధర... రూ.74,300 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.600 పెరిగింది. గత 6 నెలల్లో అంటే... జనవరి 14న వెండి ధర కేజీ రూ.65,000 ఉంది. ఇప్పుడు రూ.74,300 ఉంది. 6 నెలల్లో వెండి ధర కేజీకి రూ.9,300 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లలో ఊగిసలాట: స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. దూసుకెళ్తాయి అనుకున్న సూచీలు సడెన్‌గా డౌన్ అవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఉన్న ఆనిశ్చిత పరిస్థితుల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడుతోంది. ఇండియాలో పెట్టబడి పెట్టాలా వద్దా అనే అంశంపై విదేశీ భారత ఇన్వెస్టర్లు... లోతుగా ఆలోచించుకుంటున్నారు. తమ పెట్టుబడులు ఎందులో పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని ఆలోచిస్తున్నారు. డాలర్ విలుప పెరుగుతోంది కాబట్టి... స్టాక్ మార్కెట్లు అంతగా లాభాల్లోకి వెళ్లే అవకాశాలు లేవు. ఐతే... బిట్ కాయిన్ విలువ పడిపోతోంది కాబట్టి... స్టాక్ మార్కెట్లలోకి పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)