Gold Prices today: ఇండియాలో కరోనా పరిస్థితి ఎలా ఉంది అనే దాన్ని బట్టీ... బంగారం ధరల్లో తగ్గుదల, పెరుగుదల నమోదవుతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలవ్వగానే... బంగారం ధరలు దూసుకెళ్లాయి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా 100 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.3,650 పెరిగింది. అలాగే... 24 క్యారెట్ల పెట్టుబడుల బంగారం 10 గ్రాములు రూ.3,980 పెరిగింది. అంటే 100 రోజులుగా బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి కలిసొచ్చినట్లే లెక్క. (ప్రతీకాత్మక చిత్రం)
6 నెలల లెక్క చూస్తే... జనవరి 9న 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు ధర రూ.46,300 ఉంది. ఇప్పుడు రూ.44,750 ఉంది. అంటే... 6 నెలల్లో ధర రూ.1,550 తగ్గింది. అదే 24 క్యారెట్ల పెట్టుబడి బంగారం 10 గ్రాములు జనవరి 9న రూ.50,500 ఉండగా... ఇప్పుడు రూ.48,820 ఉంది. అంటే... 6 నెలల్లో ధర రూ.1,680 తగ్గింది. అంటే 6 నెలలుగా బంగారంపై పెట్టుబడి పెట్టినవారికి నష్టమే మిగిలినట్లు లెక్క. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Prices 10-7-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,475 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,800 ఉంది. నిన్న 8 గ్రాముల ధర రూ.80 పెరిగింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,750 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.100 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,882 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.39,056 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం రూ.88 పెరిగింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,820 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.110 పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ జిల్లాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 10-7-2021: వెండి ధర గత 10 రోజుల్లో 4 సార్లు తగ్గగా... 4 సార్లు పెరిగింది. 2 సార్లు స్థిరంగా ఉంది. నిన్న కొద్దిగా తగ్గింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.73.40 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.587.20 ఉంది. అదే 10 గ్రాములు కావాలంటే... ధర రూ.734 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,340 ఉండగా... కేజీ వెండి ధర... రూ.73,400 ఉంది. నిన్న కేజీకి రూ.700 తగ్గింది. గత 6 నెలల్లో అంటే... జనవరి 9న వెండి ధర కేజీ రూ.69,000 ఉంది. ఇప్పుడు రూ.73,400 ఉంది. 6 నెలల్లో వెండి ధర కేజీకి రూ.4,400 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: ఈ వారం స్టాక్ మార్కెట్లు ఊగిసలాట మధ్యే కొనసాగాయి. అంతకుముందువారం వీకెండ్ నాటికి లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారం మాత్రం నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం... అమెరికా సహా ప్రపంచ దేశాల్లో కూడా కొత్త వేరియంట్లు విరుచుకుపడుతుంటే... స్టాక్ మార్కె్ట్లలో పెట్టుబడులు తరలిపోతున్నాయి. వచ్చేవారం కూడా హెచ్చుతగ్గులు ఉంటాయని అంటున్నారు. ఇండియాలో కరోనా కేసులు తగ్గితే... స్టాక్ మార్కె్ట్లకు విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FII), దేశీయ సంస్థాగత పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందనీ... తద్వారా స్టాక్ మార్కెట్లు సరికొత్త మైలురాళ్లను అధిగమించగలవు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంచి పేరున్న కంపెనీల షేర్లు మాత్రమే కొనుక్కుంటే... దీర్ఘకాలంలో మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)