1. పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం బంగారం కొనాలనుకునేవారికి షాక్ తప్పదు. బంగారం, వెండి ధరలు (Gold Siver Rates) మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్లో గోల్డ్ రేట్, సిల్వర్ ధర పెరుగుతోంది. గత నాలుగు రోజుల్లో బంగారం ధర (Gold Price) మూడుసార్లు పెరిగింది. ఒక రోజు మాత్రమే గోల్డ్ రేట్ తగ్గింది. దీంతో కొనుగోలుదారులు కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. గత నాలుగు రోజులుగా చూస్తే గోల్డ్ రేట్ మూడుసార్లు పెరిగింది. 22 క్యారట్ గోల్డ్ మే 17న రూ.300 పెరిగి, మే 18న రూ.450 తగ్గింది. మే19న రూ.200 పెరగగా, మే 20న రూ.400 పెరిగింది. ఇక 24 క్యారట్ గోల్డ్ మే 17న రూ.330 పెరిగి, మే 18న రూ.490 తగ్గింది. మే19న రూ.220 పెరగగా, మే 20న రూ.440 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇప్పుడు బంగారం, వెండి ధరలు పెరుగుతున్నా గత నెలతో పోలిస్తే గోల్డ్, సిల్వర్ ధర భారీగా తగ్గింది. ఏప్రిల్ 19న 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.49,850 ఉండగా ప్రస్తుతం రూ.46,700 ధరకు పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు గోల్డ్ రేట్ రూ.3,150 తగ్గింది. ఇక స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,380 ఉండగా ప్రస్తుతం రూ.50,950 ధరకు పడిపోయింది. బంగారం ధర రూ.3,430 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. మరోవైపు మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,662 దగ్గర ట్రేడ్ అవుతుండగా, కిలో వెండి రూ.61,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,843.30 డాలర్ల దగ్గర, ఔన్స్ సిల్వర్ ధర 21.98 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)