1. కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను (Import Tax) 5 శాతం పెంచింది. మొన్నటివరకు 7.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచింది. దిగుమతి సుంకం పెరిగిన రోజే హైదరాబాద్‌లో బంగారం ధర ఏకంగా రూ.1,310 పెరగడం విశేషం. రెండో రోజు కూడా బంగారం ధర పెరిగింది. వరుసగా రెండు రోజులు గోల్డ్ ధర పెరగడం పసిడి ప్రియులకు షాకే. (ప్రతీకాత్మక చిత్రం)
4. పరిస్థితి చూస్తుందే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే వారం కూడా బంగారం ధరల్లో పెరుగుదల చూడొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. గత నెలలో దేశ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో పెరగింది. రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతుండటం, బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచి దిగుమతుల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఒకటి పెట్రోలియం పన్నుల నుండి పడిపోతున్న ఆదాయాన్ని భర్తీ చేయడం, మరొకటి కరెంట్ ఖాతా లోటును అదుపులో ఉంచడం కోసం దిగుమతి సుంకం పెంచారని ట్రేడ్‌బుల్స్ సెక్యూరిటీస్ కరెన్సీ సీనియర్ కమాడిటీ, రీసెర్చ్ అనలిస్ట్ భవీక్ పటేల్ News18.com కి తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, భారతదేశ వాణిజ్య లోటు సంవత్సరానికి 6.53 బిలియన్ డాలర్ల నుంచి 24.29 బిలియన్ డాలర్లకు పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. తాజాగా బంగారంపై 12.5 దిగుమతి సుంకం వర్తిస్తుంది. దీంతో పాటు 2.5 అగ్రి సెస్, 0.75 సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జీ ఉంటుంది. ఇవన్నీ కలిపితే బంగారం దిగుమతిపై మొత్తం 15.75 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక బంగారం కొనుగోలుదారులు 3 శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చెల్లించాలి. పన్నులన్నీ కలిపి 18.75 శాతం కావడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)