Gold Price Today: బంగారం కొనకుండా తప్పు చేశారా? గోల్డ్ రేట్ దూసుకెళ్తోంది
Gold Price Today: బంగారం కొనకుండా తప్పు చేశారా? గోల్డ్ రేట్ దూసుకెళ్తోంది
Gold Rate Today | బంగారం ధర తగ్గినప్పుడే కొనకుండా తప్పు చేశారా? ఇంకా తగ్గుతుందని వెయిట్ చేశారా? ధర మళ్లీ పెరుగుతోంది. గోల్డ్ రేట్ మళ్లీ పాత దూకుడు చూపిస్తోంది. హైదరాబాద్‌లో బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
1. బంగారం ధర మళ్లీ దూసుకెళ్తోంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర రూ.50,000 వైపు దూసుకెళ్తోంది. ఇటీవల రూ.49,000 కన్నా దిగువకు 22 క్యారట్ బంగారం ధర చేరుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు రేటు మళ్లీ పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. హైదరాబాద్‌లో 22 క్యారట్ బంగారంపై ఒక్క రోజులో రూ.450 పెరిగి రూ.49,520 ధరకు చేరుకుంది. సెప్టెంబర్ 3న ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర రూ.48,770. అంటే రూ.750 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఇక స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ.490 పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.54,020. సెప్టెంబర్ 3న స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,200. ఇప్పటి వరకు రూ.820 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. బంగారం ధర పెరిగితే హైదరాబాద్‌లో వెండి ధర తగ్గడం విశేషం. కిలో వెండిపై ఒక్క రోజులో రూ.500 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.69,000. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. ఇక మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ ధర 0.42 శాతం అంటే రూ.216 పెరిగి రూ.51,985 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ఎంసీఎక్స్‌లో సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కిలోపై 0.33 శాతం అంటే రూ.225 పెరిగి రూ.69,192 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,963.20 డాలర్లు కాగా ఔన్స్ వెండి ధర 27.38 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)