1. పెళ్లిళ్ల సీజన్ పసిడిప్రేమికులకు షాక్ ఇస్తోంది. బంగారం ధర భారీగా పెరుగుతోంది. నవంబర్ 4 నుంచి బంగారం ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. నెల రోజుల్లో బంగారం ధర రూ.4,000 పెరిగింది. దీపావళి తర్వాత కార్తీక మాసంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్లో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధర భారీగా పెరిగింది. (image: Reliance Jewels)
6. ఇక వెండి ధర అక్టోబర్ 17 నుంచి పెరుగుతూనే ఉంది. అక్టోబర్ 17న కిలో వెండి ధర రూ.60,500 ఉంటే ప్రస్తుతం కిలో వెండి ధర రూ.72,500. అంటే 50 రోజుల్లో కిలో వెండి ధర రూ.12,000 పెరిగింది. ప్రస్తుతం పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ కొనసాగుతుండటంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. (image: Reliance Jewels)
7. దేశీయ మార్కెట్లోనే కాదు, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరిగాయి. బంగారం ధర రూ.54,000 మార్క్ దాటగా, వెండి ధర రూ.67,000 మార్క్ దాటింది. గోల్డ్ 2023 ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.31 శాతం అంటే రూ.66 పెరిగి రూ.54,217 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 0.74 శాతం అంటే రూ.493 పెరిగి రూ.67,527 దగ్గర ట్రేడ్ అవుతోంది. (image: Reliance Jewels)
8. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1800 డాలర్లకు చేరువైంది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,798.70 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఔన్స్ సిల్వర్ ధర 23 డాలర్ల మార్క్ దాటింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ 23.37 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. (image: Reliance Jewels)