GOLD PRICE RISES RS 400 AND SILVER PRICE RISES RS 2000 IN MCX KNOW LATEST RATES IN HYDERABAD SS
Gold Price Today: మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి ధరలు... ఇవాళ్టి ధరలివే
Gold Price Today | బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. బంగారం ధర రూ.56,000 వైపు పరుగులు తీస్తుంటే వెండి ధర రూ.75,000 వైపు దూసుకెళ్తోంది.
1. బంగారం, వెండి ధరల పరుగు అస్సలు ఆగట్లేదు. బంగారం దూసుకెళ్తుంటే, వెండి ధర రాకెట్ స్పీడ్‌లో పెరుగుతోంది. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్ రూ.58,000 ధరకు చేరువవుతుంటే, వెండి రూ.75,000 వైపు పరుగులు తీస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర భారీగా పెరిగింది. గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర 0.71 శాతం అంటే రూ.393 పెరిగి రూ.55,491 ధరకు చేరుకుంది. బుధవారం ధర రూ.500 పైనే పెరిగిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. ఎంసీఎక్స్‌లో వెండి ధర భారీగా పెరుగుతోంది. బుధవారం కేజీ వెండిపై రూ.2,000 పెరిగితే గురువారం కూడా మరో రూ.2,000 పెరిగింది. ఎంసీఎక్స్‌లో రెండు రోజుల్లో వెండి ధర రూ.4,000 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.75,000 మార్క్ వైపు పరుగులు తీస్తోంది. గురువారం వెండి ధర 2.92 శాతం అంటే రూ.2,100 తగ్గడంతో రూ.73,993 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
5. ఇక హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు భారీగానే ఉన్నాయి. గురువారం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై రూ.10 పెరిగి రూ.57,830 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
6. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం రూ.53,000 దాటిన సంగతి తెలిసిందే. 10 గ్రాములపై రూ.10 పెరిగి రూ.53,020 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. ఇక హైదరాబాద్‌లో బుధవారం వెండి ధర ఒక్క రోజులోనే రూ.6,000 పెరిగిన సంగతి తెలిసిందే. గురువారం కిలో వెండిపై రూ.10 మాత్రమే పెరగడంతో ప్రస్తుతం రూ.71,510 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2051.30 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 27.60 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
9. కరోనా వైరస్ సంక్షోభంలో బంగారం, వెండిపై ఇన్వెస్ట్ చేసినవారికి బాగానే లాభాలు వస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లలో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)