Gold price today: భగ్గుమన్న బంగారం, వెండి ధరలు... తులం ఎంతంటే
Gold price today: భగ్గుమన్న బంగారం, వెండి ధరలు... తులం ఎంతంటే
Gold Rate Today | బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. కొత్త రికార్డులు సృష్టించాయి. కరోనా వైరస్ మహమ్మారి ఇంకా ప్రభావం చూపిస్తుండటంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
1. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.50,000 వైపు పరుగులు తీస్తోంది. సోమవారం 10 గ్రాములపై రూ.390 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.48,930 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.45,860. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
2. వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో బంగారంపై ఏకంగా రూ.1,790 పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి రూ.48,500. మరోవైపు మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు రికార్డులు సృష్టించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
3. ఎంసీఎక్స్‌లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై ఏకంగా 1 శాతం అంటే రూ.473 పెరిగి రూ.47,854 ధరకు చేరుకుంది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ భారీగా పెరిగింది. కిలో వెండిపై 4.73 శాతం అంటే రూ.2,209 పెరిగి రూ.48,927 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
4. పసిడి రేటు భారీగా పెరగడంతో భారతదేశంలో బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి. గత నెలలో ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ.47,000 మార్క్ దాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రూ.48,000 ధరకు చేరువైంది. రూ.50,000 వైపు పరుగులు తీస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
5. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆందోళనలు కొనసాగుతుండటం, ఆర్థిక వ్యవస్థలు మాంద్యం అంచుకు చేరుకుండటం లాంటి కారణాలతో బంగారం ధర పెరుగుతోంది. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుండటంతో గోల్డ్‌కు డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలు భగ్గుమంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)