1. బంగారం ధర ఇటీవల భారీగా తగ్గుతూ వస్తోంది. గత 10 రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.260 పెరిగింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పతనం అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. గురువారం హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.260 పెరిగి రూ.47,300 నుంచి రూ.47,560 కి చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ గోల్డ్ ధర రూ.250 పెరిగి రూ.43,350 నుంచి రూ.43,600 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. ఇక వెండి ధర చూస్తే కిలో వెండిపై ఏకంగా రూ.400 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.67,900 నుంచి రూ.67,500 కి చేరుకుంది. గతంలో కిలో వెండి ధర రూ.70,000 దాటిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. జూలై 30 నుంచి మార్కెట్లో బంగారం ధర పతనం అవుతున్న సంగతి తెలిసిందే. జూలై 30న హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం ధర రూ.49,370 ఉండగా, 22 క్యారట్ బంగారం ధర రూ.45,250 ధర పలికింది. అప్పట్నుంచీ బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. ఈ ఒక్కరోజు బంగారం ధర పెరిగినా జూలై 30 నాటితో పోలిస్తే ఇప్పుడు స్వచ్ఛమైన బంగారం రూ.2,070 తక్కువకు, 22 క్యారట్ బంగారం రూ.1,650 తక్కువకు లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. మరోవైపు ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర 0.27 శాతం అంటే రూ.125 తగ్గి రూ.46,263 దగ్గర ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర 1.06 శాతం అంటే రూ.666 తగ్గి రూ.62,105 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)