GOLD PRICE RISES RS 260 IN HYDERABAD KNOW LATEST GOLD AND SILVER RATES SS
Gold Price Today: ఇంకా బంగారం కొనలేదా? రేటు మళ్లీ పెరిగిపోయింది
Gold Rate Today | బంగారం కొనాలనుకొని కొనలేకపోయారా? ఇంకా తగ్గుతుందేమోనని ఎదురుచూసారా? గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది. బంగారమే కాదు వెండి ధర కూడా పెరిగింది. ధర ఎంత పెరిగిందో తెలుసుకోండి.
1. పసిడిప్రేమికులకు షాక్. బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. తగ్గుతుందని అనుకున్న గోల్డ్ రేట్ మళ్లీ పైపైకి వెళ్తోంది. వెండి ధర కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
2. హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ గోల్డ్ ధర రూ.240 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.49,090. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
3. స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ.260 పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.53,550. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
4. వారం క్రితం హైదరాబాద్‌లో 22 క్యారట్ గోల్డ్ ధర రూ.48,770 ఉండగా, 24 క్యారట్ బంగారం రూ.53,200 ధరకు దిగొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
5. కానీ సెప్టెంబర్ 4 నుంచి బంగారం ధర 5 సార్లు పెరిగింది. 22 క్యారట్ గోల్డ్‌తో పాటు 24 క్యారట్ గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
6. ఇక వెండి ధర కూడా భారీగానే పెరుగుతోంది. కిలో వెండిపై ఒక్క రోజులో రూ.600 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.68,500. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
7. సెప్టెంబర్ 3న కిలో వెండి రూ.65,600 ధరకు దిగొచ్చింది. కానీ వారం రోజుల్లో కిలో వెండిపై సుమారు రూ.3,000 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
8. ఇక మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ ధర 0.09 శాతం అంటే రూ.48 పెరిగి రూ.51,450 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
9. ఎంసీఎక్స్‌లో సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కిలోపై 0.62 శాతం అంటే రూ.427 పెరిగి రూ.68,870 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
10. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,947.80 డాలర్లు కాగా ఔన్స్ వెండి ధర 27.16 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)