1. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించడంతో స్టాక్ మార్కెట్లు వణికిపోతున్నాయి. మరోవైపు గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1,400 పెరిగి రూ.51,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 13 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 1950 డాలర్లు దాటింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇక ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.1170 పెరిగి రూ.65,755 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 24.97 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావంతోనే అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా గోల్డ్ ధర భారీగా పెరిగింది. లేటెస్ట్ గోల్డ్ రేట్స్ చూస్తే స్వచ్ఛమైన బంగారం అయిన 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.930 పెరిగి రూ.51,110 ధరకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.850 పెరిగి రూ.46,850 ధర దగ్గర లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. 2020 లో కూడా కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనం అయ్యాయి. అప్పుడు కూడా గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పెరిగాయి. 2020 ఆగస్టు 7న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారట్ బంగారం 10 గ్రాములు రూ.59,130 ధరకు చేరుకోగా, 22 క్యారట్ బంగారం 10 గ్రాములు రూ.54,200 ధరకు చేరుకున్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)