2. శనివారం హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా పెరిగింది. లేటెస్ట్ రేట్స్ చూస్తే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.900 పెరిగి రూ.46,100 నుంచి రూ.47,000 ధరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.990 పెరిగి రూ.50,290 నుంచి రూ.51,280 ధరకు చేరుకుంది. స్వచ్ఛమైన బంగారంతో పాటు, ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర భారీగా పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. గతవారం దీపావళి నుంచి నిన్నటి వరకు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.910 తగ్గగా, 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.1,000 తగ్గింది. కానీ ఒక్కరోజులోనే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.900 పెరగగా, 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.990 పెరిగింది. దీంతో గత వారం నుంచి తగ్గిన మొత్తం ఒక్కరోజులోనే కవర్ అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. హైదరాబాద్‌లో బంగారం ధరలు మాత్రమే కాదు, వెండి ధర కూడా భారీగా పెరిగింది. శనివారం కిలో వెండిపై ఏకంగా రూ.1,900 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.64,400 దగ్గర అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో గత రెండు రోజుల్లో కిలో వెండిపై రూ.2,300 పెరిగింది. అంతకన్నా ముందు రెండు రోజుల్లో కిలో వెండి ధర రూ.1,000 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. దేశీయ మార్కెట్లోనే కాదు మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.39 శాతం అంటే రూ.696 పెరిగి రూ.50,880 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 3.72 శాతం అంటే రూ.2,169 పెరిగి రూ.60,495 దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి ధర రూ.60,000 మార్క్‌ను దాటడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,683.70 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుండగా, ఔన్స్ వెండి ధర 20 డాలర్ల మార్క్ దాటి 20.95 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం కూడా గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)