Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు... లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు... లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Rate Today | బంగారం, వెండి ధరలు మరోసారి మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో మాత్రం ధరల్లో పెద్దగా తేడా లేదు. ఇవాళ్టి బంగారం, వెండి ధరలెలా ఉన్నాయో తెలుసుకోండి.
1. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర భారీగా పెరిగింది. గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై ఏకంగా 1.39 శాతం అంటే రూ.646 పెరిగి రూ.47,034 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
2. ఎంసీఎక్స్‌లో వెండిధర కూడా భారీగా పెరిగింది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ కిలోపై 1.09 శాతం అంటే రూ.517 పెరిగి రూ.47,852 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
3. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,729.40 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 16 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
4. ఇక హైదరాబాద్‌లో బంగారం వెండి ధరల్లో పెద్దగా మార్పు లేదు. 10 గ్రాములపై కేవలం రూ.10 మాత్రమే పెరిగింది. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.49,060 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.45,250. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
5. హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.10 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.48,210. (ప్రతీకాత్మక చిత్రం)