1. బంగారం ధర (Gold Rate) మళ్లీ తగ్గుతుందని పసిడిప్రేమికులు సంతోషపడుతుండగానే ఒక్కరోజులో ఆ సంతోషం ఆవిరవుతోంది. గోల్డ్ రేట్ రెండు రోజులు తగ్గుతోంది. మళ్లీ భారీగా పెరుగుతోంది. గత రెండు రోజులు గోల్డ్ రేట్ తగ్గింది. ఇవాళ బంగారం ధర మళ్లీ పెరిగింది. ఒక్క రోజులో గోల్డ్ రేట్ భారీగా పెరగడం పసిడిప్రేమికులకు షాకిచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. హైదరాబాద్లో బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. బుధవారం కిలో వెండిపై రూ.700 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.67,400 దగ్గర అందుబాటులో ఉంది. నవంబర్ 4 నుంచి వెండి ధర కిలోపై రూ.3,400 పెరిగింది. అంతకన్నా ముందు రెండు రోజుల్లో కిలో వెండి ధర రూ.1,000 తగ్గిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
4. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగితే మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.28 శాతం అంటే రూ.144 తగ్గి రూ.51,486 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.45 శాతం అంటే రూ.278 తగ్గి రూ.61,681 దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి ధర రూ.61,000 మార్క్ పైన కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 1700 డాలర్ల మార్క్ దాటింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 1710.10 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఔన్స్ సిల్వర్ ధర 21 డాలర్ల మార్క్ దాటింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ 21.37 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)