4. హైదరాబాద్లో బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం కిలో వెండిపై రూ.500 పెరిగి రూ.67,500 ధరకు చేరుకుంది. అక్టోబర్ 15 నుంచి వెండి ధర పెరుగుతూనే ఉంది. అక్టోబర్ 15 నుంచి ఇప్పటివరకు కిలో వెండిపై రూ.7,000 పెరిగింది. ఈ నెలలోనే వెండి ధర కిలో వెండిపై రూ.2,500 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. దేశీయ మార్కెట్లోనే కాదు మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరిగాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.48 శాతం అంటే రూ.249 పెరిగి రూ.52,358 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.98 శాతం అంటే రూ.604 పెరిగి రూ.62,515 దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి ధర రూ.62,000 మార్క్ దాటడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 1750 డాలర్ల మార్క్ దాటింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 1761.50 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఔన్స్ సిల్వర్ ధర 22 డాలర్ల మార్క్ దాటింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ 22.02 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)