4. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10 నుంచి ఇవాళ్టివరకు 22 క్యారట్ గోల్డ్ ధర రూ.1,550 పెరగగా, 24 క్యారట్ గోల్డ్ ధర రూ.1,690 పెరిగింది. బంగారం ధరలు రికార్డ్ ధరవైపు పరుగులు తీస్తున్నాయి. గోల్డ్ గరిష్ట ధరలు చూస్తే 2020 సంవత్సరంలో 22 క్యారట్ బంగారం రూ.54,200 ధరకు, 24 క్యారట్ బంగారం రూ.59,130 ధరకు చేరుకున్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
5. హైదరాబాద్ మార్కెట్లోనే కాదు, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గోల్డ్ 2023 ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.79 శాతం అంటే రూ.445 పెరిగి రూ.56,595 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మే ఫ్యూచర్స్ 1.03 శాతం అంటే రూ.645 పెరిగి రూ.63,535 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)