1. పెళ్లిళ్ల సీజన్ కారణంగా గోల్డ్ రేట్ భారీగా పెరుగుతోంది. అక్టోబర్‌లో పండుగ సీజన్ ముగిసిన తర్వాత తగ్గిన బంగారం ధర, నవంబర్‌లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో మళ్లీ పెరుగుతోంది. నవంబర్ మొదటి వారం నుంచి బంగారం ధర పెరిగిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. స్వచ్ఛమైన బంగారం, ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ భారమవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. గురువారం కూడా హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ్టి ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.750 పెరిగి రూ.48,000 నుంచి రూ.48,750 ధరకు చేరుకుంది. గత రెండు రోజుల్లో 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.950 పెరిగింది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.820 పెరిగి రూ.52,360 నుంచి రూ.53,180 ధరకు చేరుకుంది. స్వచ్ఛమైన బంగారం ధర రెండు రోజుల్లో రూ.1,030 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. నవంబర్ 4 నుంచి చూస్తే బంగారం ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 4న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా ప్రస్తుతం రూ.48,750 ధరకు చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్‌పై రూ.6,650 పెరిగింది. ఇక నవంబర్ 4న 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,290 ఉండగా ప్రస్తుతం రూ.53,180 ధరకు చేరుకుంది. స్వచ్ఛమైన బంగారంపై రూ.2,890 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. హైదరాబాద్‌లో గురువారం బంగారం ధరలు భారీగా పెరిగితే వెండి ధర భారీగా తగ్గింది. ఇవాళ కిలో వెండిపై ఏకంగా రూ.1,300 తగ్గింది. దీంతో ధర రూ.67,200 కి చేరుకుంది. అక్టోబర్ 15 నుంచి వెండి ధర పెరుగుతూనే ఉంది. నెల రోజుల్లో వెండి ధర రూ.60,500 నుంచి రూ.67,200 కి చేరుకుంది. నెల రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ.6,700 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)