2. గురువారం హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ్టి ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.300 పెరిగి రూ.48,250 నుంచి రూ.48,550 ధరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.330 పెరిగి రూ.52,640 నుంచి రూ.52,970 ధరకు చేరుకుంది. నవంబర్ 4 నుంచి నవంబర్ 17 వరకు బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 18 నుంచి గోల్డ్ రేట్ తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. నవంబర్ 4న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా ప్రస్తుతం రూ.48,550 ధరకు చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్‌పై రూ.2,450 పెరిగింది. ఇక నవంబర్ 4న 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,290 ఉండగా ప్రస్తుతం రూ.52,970 ధరకు చేరుకుంది. స్వచ్ఛమైన బంగారంపై రూ.2,680 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. దేశీయ మార్కెట్లోనే కాదు, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరిగాయి. బంగారం ధర రూ.52,000 మార్క్ పైనే ఉండగా, వెండి ధర మళ్లీ రూ.62,000 మార్క్ దాటింది. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.41 శాతం అంటే రూ.215 పెరిగి రూ.52,666 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.05 శాతం అంటే రూ.645 పెరిగి రూ.62,275 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1750 డాలర్ల మార్క్ దాటింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,756.40 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఔన్స్ సిల్వర్ ధర 21 డాలర్ల మార్క్ పైనే ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ 21.70 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రస్తుతం భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పెళ్లిళ్ల సీజన్ ఉంది. నవంబర్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు దేశంలో సుమారు 32 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని అంచనా. పెళ్లిళ్ల సీజన్లో బంగారానికి డిమాండ్ ఎక్కువ కాబట్టి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)