2. ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.100 పెరిగి ధర రూ.47,000 నుంచి రూ.47,100 వరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై రూ.51,280 దగ్గర ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక హైదరాబాద్లో వెండి ధరలు చూస్తే గత ఆరు రోజులుగా పెరుగుతున్న సిల్వర్ రేట్ ఇవాళ భారీగా తగ్గింది. గురువారం కిలో వెండిపై రూ.1000 తగ్గి రూ.63,500 దగ్గర ట్రేడ్ అవుతోంది. అక్టోబర్ 15 నుంచి ఇప్పటి వరకు కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. అయితే అక్టోబర్ 5 నాటి ధరలతో పోలిస్తే కిలో వెండి రూ.3,500 తక్కువకే లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,669.70 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 19.71 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఇదే సమయానికి ఔన్సు బంగారం ధర 1,830.50 డాలర్లకు పెరగవచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
6. ధంతేరాస్, దీపావళి పండుగ సీజన్ ముగిసింది కాబట్టి బంగారం, వెండి అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది. ధంతేరాస్ ముందురోజు, ధంతేరాస్ రోజు కలిపి భారతీయులు మొత్తం రూ.19,500 కోట్ల విలువైన 39,000 కిలోల బంగారాన్ని కొన్నట్టు ఇండియా బిలియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)