1. బంగారం, వెండి ధరలు రికార్డు ధరకు చేరువవుతున్నాయి. గత రెండు నెలలుగా గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పెరుగుతున్నాయి. రెండు నెలల్లో బంగారం ధర రూ.5,000 పెరగగా, కిలో వెండి ధర రూ.15,000 పెరిగింది. బంగారం, వెండి ధరలు పెరుగుతున్న తీరు చూస్తుంటే 2020 నాటి పరిస్థితులు గుర్తొస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆ రికార్డు ధరల వైపు గోల్డ్, సిల్వర్ పరుగులు తీస్తోంది. ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాములు 22 క్యారట్ బంగారం ధర రూ.54,200 కి చేరుకోగా, 24 క్యారట్ బంగారం ధర రూ.59,130 పలికింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. దేశీయ మార్కెట్లోనే కాదు, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం ధర పెరిగి, వెండి ధర తగ్గింది. గోల్డ్ 2023 ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.03 శాతం అంటే రూ.14 పెరిగి రూ.55,781 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 0.09 శాతం అంటే రూ.64 తగ్గి రూ.69,254 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)