1. గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. రెండు నెలల్లో గోల్డ్ రేట్ రూ.5,000 పైనే పెరిగింది. వెండి ధర ఏకంగా కిలోపై రూ.15,000 పెరిగింది. గతేడాది లాగానే ఈ సంవత్సరం కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. నవంబర్ 4 నుంచి బంగారం ధరలు భారీగా పెరిగాయి. నవంబర్ 4న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా ప్రస్తుతం రూ.51,100 ధరకు చేరుకుంది. సరిగ్గా రెండు నెలల్లో 22 క్యారెట్ బంగారం ధర రూ.5,000 పెరిగింది. ఇక అదే రోజున 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,290 ఉండగా ప్రస్తుతం రూ.55,750 ధరకు చేరుకుంది. సరిగ్గా రెండు నెలల్లో 22 క్యారెట్ బంగారం ధర రూ.5,460 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. దేశీయ మార్కెట్లోనే కాదు, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ 2023 ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.35 శాతం అంటే రూ.193 పెరిగి రూ.55,723 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 0.25 శాతం అంటే రూ.173 పెరిగి రూ.70,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)