1. బంగారం ధర భారీగా పతనం కావడంతో సంతోషపడ్డ మహిళలకు, పసిడిప్రేమికులకు బ్యాడ్ న్యూస్. బుధవారం బంగారం ధర పెరిగింది. గత నాలుగు రోజుల్లో బంగారం ధర రూ.1,200 తగ్గిన సంగతి తెలిసిందే. కానీ బుధవారం దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ.300 పైనే పెరిగింది. దీంతో నాలుగు రోజుల పతనానికి బ్రేక్ పడింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. బుధవారం హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. లేటెస్ట్ రేట్స్ చూస్తే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.300 పెరిగి రూ.46,850 ధరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.330 పెరిగి రూ.51,110 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగితే, వెండి ధర స్థిరంగానే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,000. అక్టోబర్ రెండో వారం తర్వాత వెండి ధరలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 16 నుంచి ఇప్పటి వరకు కిలో వెండిపై ఏకంగా రూ.4,500 పెరిగింది. ఇక ధంతేరాస్ ముందు పెరిగిన బంగారం ధరలు, దీపావళి తర్వాత భారీగా పతనం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ గోల్డ్ రేట్ పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధరలు తక్కువగానే ఉండటం విశేషం. అక్టోబర్ 8 నాటి ధరలతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ రూ.1,000 తక్కువకు, 24 క్యారెట్ గోల్డ్ రూ.1,000 తక్కువకు లభిస్తోంది. గత నెల కన్నా తక్కువ ధరకే బంగారం లభిస్తుండటం కొనుగోలుదారులకు మంచి అవకాశాన్ని ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,651.10 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 19.73 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్లో మరో 12 నెలల్లో ఔన్సు బంగారం ధర 1,830 డాలర్లకు చేరవచ్చని ఇటీవల నిపుణులు వెల్లడించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)