3. హైదరాబాద్‌లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.380 పెరగడంతో రూ.56,730 నుంచి రూ.57,110 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా పెరిగితే వెండి ధర భారీగా పతనం అయింది. కిలో వెండిపై ఏకంగా రూ.1400 తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి రూ.73,500 నుంచి రూ.72,100 ధరకు చేరుకుంది. గత నాలుగు రోజులుగా వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. నాలుగు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ.3,700 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. నవంబర్ 4 నుంచి బంగారం ధరలు భారీగా పెరిగాయి. నవంబర్ 4న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా ప్రస్తుతం రూ.52,350 ధరకు చేరుకుంది. ఇప్పటి వరకు 22 క్యారెట్ బంగారం ధర రూ.6,250 పెరిగింది. ఇక అదే రోజున 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,290 ఉండగా ప్రస్తుతం రూ.57,110 ధరకు చేరుకుంది. ఇప్పటి వరకు 22 క్యారెట్ బంగారం ధర రూ.6,820 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక వెండి ధర గత నాలుగు రోజులుగా తగ్గుతున్నా, మూడు నెలల్లో రికార్డు స్థాయిలో పెరగడం విశేషం. 2022 అక్టోబర్ 16 నుంచి వెండి ధర భారీగా పెరిగింది. అక్టోబర్ 16న కిలో వెండి రూ.60,500 ఉంటే ఇప్పుడు కిలో వెండి ధర రూ.72,100 దగ్గర లభిస్తోంది. అంటే మూడు నెలల్లో రూ.11,600 పెరగడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
6. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరిగింది. గోల్డ్ 2023 ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.28 శాతం అంటే రూ.159 తగ్గి రూ.56,705 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 0.85 శాతం అంటే రూ.575 పెరిగి రూ.68,934 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఔన్స్ బంగారం ధర 1950 వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1928 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఇక ఔన్స్ సిల్వర్ ధర 24.08 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)