GOLD PRICE RISES 6TH DAY IN A ROW SILVER RATE FALLS KNOW LATEST GOLD AND SILVER RATES SS
Gold Price Today: వరుసగా 6వ రోజు పెరిగిన బంగారం ధర... ఇవాళ్టి రేట్స్ ఇవే
Gold Rate Today | బంగారం ధర పరుగులు తీస్తూనే ఉంది. వరుసగా 6వ రోజు గోల్డ్ రేట్ పెరిగింది. వెండి ధర తగ్గింది. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
1. బంగారం ధర వరుసగా 6వ రోజు పెరిగింది. ఎంసీఎక్స్‌లో రూ.51,000 ధరకు చేరువవుతోంది. వెండి ధర రూ.60,000 పైనే కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 ధరకు దగ్గరవుతోంది. గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 0.20 శాతం అంటే రూ.102 పెరిగి రూ.50,802 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. వెండి ధర పరుగు కాస్త ఆగింది. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో ధర రూ.61,000 దిగువకు చేరుకుంది. వెండి ధర 0.33 శాతం అంటే రూ.202 తగ్గడంతో రూ.60,988 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. ఇక హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.10 పెరిగి రూ.52,510 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.10 పెరిగి రూ.48,160 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ఇక హైదరాబాద్‌లో వెండి ధర రూ.62,000 పైనే కొనసాగుతోంది. కిలో వెండిపై రూ.10 పెరగడంతో ప్రస్తుతం రూ.62,010 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,886 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 22.70 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)