4. బంగారం, వెండి ధరలు జీవితకాల గరిష్ట స్థాయికి చేరువవుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆ రికార్డు ధరల వైపు గోల్డ్, సిల్వర్ ధరలు పరుగులు తీస్తున్నాయి. 2020 ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాములు 22 క్యారట్ బంగారం ధర రూ.54,200 కి చేరుకోగా, ప్రస్తుతం రూ.53,600 ధరలో లభిస్తోంది. మరో రూ.600 పెరిగితే రికార్డు ధరను టచ్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక 2020 ఆగస్ట్ 7న 24 క్యారట్ బంగారం రూ.59,130 ధరకు చేరుకోగా ప్రస్తుతం రూ.58,470 ధరలో లభిస్తోంది. మరో రూ.660 పెరిగితే చాలు స్వచ్ఛమైన బంగారం ధర రికార్డు ధరను తాకుతుంది. ఇక వెండి రికార్డు ధరను దాటేసింది. 2020 ఆగస్ట్ 7న కిలో వెండి రూ.76,150 ధర ఉండగా, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.77,300. (ప్రతీకాత్మక చిత్రం)
6. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పెరిగాయి. గోల్డ్ 2023 ఫిబ్రవరి ఫ్యూచర్స్ 1.03 శాతం అంటే రూ.598 పెరిగి రూ.58,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ ఏకంగా 2.34 శాతం అంటే రూ.1,631 పెరిగి రూ.71,472 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఔన్స్ బంగారం ధర 1950 డాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,953.10 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఔన్స్ సిల్వర్ ధర 24.00 డాలర్లు దాటి 24.24 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)