బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో తయారీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు వీటి నాణ్యత, భద్రతపై అనుమానంతో పాటు, బీమా కవరేజీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక నగదు కోసం బంగారాన్ని తిరిగి అమ్మే సమయంలో ఇందులోంచి తరుగు తీస్తారు. మరి ఏం చేయాలి అనుకుంటున్నారా... బంగారాన్ని ఆధారంగా చేసుకున్న పలు పథకాలపై పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఈ పథకాల ద్వారా పసిడి పెట్టుబడులు పెట్టడం, వెనక్కి తీసుకోవడం చాలా సులువు. అయితే పెట్టుబడులు పెట్టేందుకు మరో నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్), మల్టీ అసెట్ ఫండ్స్, ఇంటర్నేషనల్ గోల్డ్ ఫండ్స్. మనకు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.