మీకు తెలుసా... నాలుగేళ్లలో బంగారం ధర 100 శాతం పెరిగింది. నాలుగేళ్ల కిందట 10 గ్రాములు రూ.25,000 ఉండేది... ఈ సంవత్సరం రూ.59వేలు దాటింది. ఆగస్ట్ 7 తర్వాత తగ్గినా... నవంబర్ 30 నుంచి పెరుగుతూ ఉంది. 2020లో మిగతా పెట్టుబడి అంశాలు నష్టాల్లోకి వెళ్లగా... బంగారం మాత్రం భారీ లాభాలు ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఒక్క సంవత్సరమే బంగారం 37 నుంచి 38 శాతం రిటర్నులు ఇచ్చింది. రూ.40,000 నుంచి రూ.59,000 దాకా వెళ్లింది. ప్రస్తుతం 51,000 దగ్గర ఉంది. ఆగస్ట్ 7 తర్వాత బంగారం ధరలు పడిపోతూ వచ్చాయి. అలాగని పూర్తిగా పడిపోలేదు. నవంబర్ 30 నుంచి మళ్లీ రివర్స్ ట్రెండ్ మొదలైంది. ధరలు తగ్గి, తిరిగి పెరుగుతున్నప్పుడే పెట్టుబడి పెట్టాలన్నది ఫార్ములా. ఆ రకంగా చూస్తే... గోల్డ్‌పై పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవ్వడం మంచిదంటున్నారు నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వ్యాక్సిన్ ప్రభావం బంగారం ధరలపై పడే ప్రమాదం ఉంది. ఓ అంచనా ప్రకారం... జనవరిలో కరోనా వ్యాక్సిన్ రానుంది. వ్యాక్సిన్ వచ్చినప్పుడు బంగారం ధరలు 8 నుంచి 10 శాతం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ బంగారం ధరలు పెరిగే సూచనలు బాగా ఉన్నాయి. ఇందుకు కారణం... వ్యాక్సిన్ వచ్చాక... దేశంలో అర్థిక కార్యకలాపాలు జోరందుకుంటాయి. ఫలితంగా ప్రజల దగ్గర డబ్బు పెరుగుతుంది. బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. తద్వారా గోల్డ్ రేట్లు కూడా పెరగడం ఖాయం. అందువల్ల జనవరిలో బంగారం ధర తగ్గినప్పుడో లేదంటే... ఇప్పుడు ఉన్న ధరకో బంగారంపై పెట్టుబడి పెడితే కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు ఎనలిస్టులు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధర రూ.54,000 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రివర్స్ ట్రెండ్ మొదలై... 48,000 దాకా తగ్గే ఛాన్స్ ఉండొచ్చు. ఆ తర్వాత మళ్లీ పెరగొచ్చనే అంచనా ఉంది. దీనికి కారణం దేశంలో బంగారం నగల కొనుగోళ్లు బలంగా ఉండటమే. అందువల్ల గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు... ఈ సమయంలో లోతుగా విశ్లేషించుకుంటూ... సరైన నిర్ణయం తీసుకోవాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)