3. ఇంత తక్కువ ధరకు బంగారం కొనే అవకాశం కేవలం గోల్డ్‌ను పెట్టుబడిగా భావించేవారికి మాత్రమే. అలాంటివారికోసం కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇష్యూ చేసినప్పుడే కాదు... మార్కెట్లో ఎప్పుడైనా ఈ బాండ్లు కొనొచ్చు. మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ధర కన్నా సావరిన్ గోల్డ్ బాండ్ల ధరలు తక్కువగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. దాన్నే సెకండరీ మార్కెట్ అంటారు. ప్రస్తుతం సెకండరీ మార్కెట్లో SGBNOV25 సిరీస్ గోల్డ్ బాండ్ 1 గ్రాము ధర రూ.3900 ఉంది. అదే స్వచ్ఛమైన బంగారం 1 గ్రాము కొనాలంటే రూ.4500 చెల్లించాలి. అదే సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్ కొంటే 10 శాతం పైనే డిస్కౌంట్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. SGBNOV25 సిరీస్ గోల్డ్ బాండ్ 2025 నవంబర్‌లో మెచ్యూర్ అవుతుంది. ఇలా వేర్వేరు కాలవ్యవధులతో బోల్డ్ బాండ్స్ సెకండరీ మార్కెట్లో దొరుకుతుంటాయి. సావరిన్ గోల్డ్ బాండ్ గురించి తెలిసింది చాలా తక్కువమందికే. ఫిజికల్ గోల్డ్ కొనకుండా బాండ్ రూపంలో బంగారాన్ని కొని పెట్టుబడి పెట్టేందుకు సావరిన్ గోల్డ్ బాండ్ ఉపయోగపడుతోంది. వాస్తవానికి బాండ్ ఎనిమిదేళ్ల వ్యవధితో లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నవాళ్లు ముందుగానే సెకండరీ మార్కెట్లో అమ్మేస్తుంటారు. సావరిన్ గోల్డ్ బాండ్‌పై ప్రతీ ఏడాది 2.5% వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో బంగారం ధర ఎంత ఉంటే అంత చెల్లిస్తుంది ఆర్బీఐ. మెచ్యూరిటీ వరకు గోల్డ్ బాండ్స్ హోల్డ్ చేస్తే వచ్చే లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా లేదు. ఒకవేళ అంతకంటే ముందే రీడీమ్ చేసుకోవాలనుకుంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. సావరిన్ గోల్డ్ బాండ్స్ వల్ల మంచి లాభాలు ఉన్నట్టు అయితే ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో ఎందుకు లభిస్తున్నాయన్న అనుమానం మీకు రావచ్చు. సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్ముతున్నవాళ్లు ఇప్పుడు ఇస్తున్న ధర కంటే తక్కువ ధరకే బాండ్స్ కొని ఉంటారు. వారికి ఇప్పుడు అమ్మినా లాభమే. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇప్పుడు డబ్బు అవసరమై లేదా భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయో అన్న అనుమానంతో వాటిని సెకండరీ మార్కెట్లో అమ్ముతుంటారు ఇన్వెస్టర్లు. సావరిన్ గోల్డ్ బాండ్స్ గురించి అవగాహన తక్కువ ఉన్నందున వాటి అమ్మకాలు, కొనుగోళ్లు తక్కువగానే ఉంటాయి. సావరిన్ గోల్డ్ బాండ్స్‌కు డిమాండ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. బాండ్స్ తక్కువగానే అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఒకవేళ మీరు సావరిన్ గోల్డ్ బాండ్ కొని మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేయకపోతే ఇలా డిస్కౌంట్ ధరకే అమ్మాల్సి వస్తుందన్నది నిపుణుల వాదన. మీరు సావరిన్ గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఒకేసారి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)