1. బంగారం, వెండి ధరలు రోజురోజుకీ తగ్గుతున్నాయని పసిడిప్రేమికులు సంబరపడుతున్న సమయంలో గోల్డ్ రేట్ (Gold Rate) మళ్లీ షాక్ ఇస్తోంది. వరుసగా మూడు రోజులుగా బంగారం ధర పెరుగుతోంది. దీంతో పసిడిప్రేమికులకు మళ్లీ షాక్ తప్పేలా లేదు. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.56,000 మార్క్ పైన ఉండగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రూ.52,000 మార్క్‌కు చేరువైంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర చూస్తే 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.56,290 నుంచి రూ.రూ.56,450 ధరకు చేరుకుంది. గత మూడు రోజుల్లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.430 పెరిగింది. మరోవైపు వెండి ధర తగ్గుతూ, పెరుగుతూ ఉంది. గురువారం కిలో వెండిపై రూ.200 తగ్గడంతో రూ.70,000 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. గోల్డ్ 2023 ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.07 శాతం అంటే రూ.40 తగ్గి రూ.55,790 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 0.60 శాతం అంటే రూ.385 తగ్గి రూ.63,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)