1. జనవరిలో మొదటి 9 రోజుల్లో బంగారం ధర 5 సార్లు పెరిగిన సంగతి తెలిసిందే. కానీ గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గుతోంది. మరోవైపు వెండి ధర మంగళవారం భారీగా తగ్గిన వెండి ధర, బుధవారం స్వల్పంగా పెరిగింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర రూ.51,000 పైన ఉంటే, స్వచ్ఛమైన బంగారం ధర రూ.56,000 మార్క్ దిగువకు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. బుధవారం హైదరాబాద్‌లో బంగారం ధర వరుసగా రెండో రోజు తగ్గింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర రూ.51,000 మార్క్ పైనే ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.150 తగ్గడంతో రూ.51,450 నుంచి రూ.51,300 ధరకు చేరుకుంది. ఇక స్వచ్ఛమైన బంగారం ధర రూ.56,000 మార్క్ దిగువకు మరోసారి దిగొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరిగాయి. గోల్డ్ 2023 ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.32 శాతం అంటే రూ.178 పెరిగి రూ.55,890 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 1.01 శాతం అంటే రూ.689 పెరిగి రూ.69,052 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఔన్స్ బంగారం ధర 1900 డాలర్లకు చేరువవుతోంది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1885.60 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఇక ఔన్స్ సిల్వర్ ధర 24.00 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ముగిసిన తర్వాత కూడా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం ధర రూ.5,000 పైనే పెరిగితే, వెండి ధర రూ.14,000 పైనే పెరిగింది. ఫిబ్రవరిలో పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో దేశీయ మార్కెట్లో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)