1. బంగారం ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.52,000 రేంజ్లో ఉంది. మీరు ఇప్పుడు బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? భారీ డిస్కౌంట్‌తో బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చు. స్వచ్ఛమైన బంగారం రూ.47,000 లోపే దొరుకుతోంది. ఎలాగో తెలుసుకునేముందు ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
2. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం స్వచ్ఛమైన బంగారం అయిన 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.440 తగ్గి రూ.51,930 ధరకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ గోల్డ్ ధర రూ.500 పెరిగి రూ.47,600 ధరకు చేరుకుంది. కిలో వెండిపై ఏకంగా రూ.1,400 తగ్గి రూ.72,800 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) రూపంలో మంచి అవకాశం లభిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతీ నెలా సావరిన్ గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభిస్తుంది. ఇటీవల సబ్స్క్రిప్షన్ ముగిసింది. అయితే సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్లను డిస్కౌంట్లో కొనొచ్చన్న విషయం తక్కువ మందికే తెలుసు. (ప్రతీకాత్మక చిత్రం)
5. అంటే సావరిన్ గోల్డ్ బాండ్ రూపంలో ఒక గ్రాము స్వచ్ఛమైన గోల్డ్ రూ.4,650 ధరకే లభిస్తుండటం విశేషం. అదే మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ఒక గ్రాము కొనాలంటే రూ.5,193 చెల్లించాలి. అంటే ఒక గ్రాముపై 10 శాతం పైనే రూ.543 డిస్కౌంట్ లభిస్తుంది. 10 గ్రాములు కొంటే రూ.5,430 డిస్కౌంట్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్ కొనే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. గోల్డ్ బాండ్ ఎప్పుడు మెచ్యూర్ అవుతుందో చెక్ చేయాలి. SGBSEP27 బాండ్ 2027 సెప్టెంబర్‌లో మెచ్యూర్ అవుతుంది. అంటే మీరు అప్పటి వరకు ఈ బాండ్ హోల్డ్ చేసి రీడీమ్ చేసుకోవచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో వేర్వేరు కాలవ్యవధులతో గోల్డ్ బాండ్స్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. సావరిన్ గోల్డ్ బాండ్ కొంటే ఫిజికల్ గోల్డ్ రాదు. ఇది డిజిటల్ గోల్డ్ లాంటిదే. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆర్బీఐ సబ్స్క్రిప్షన్ ప్రారంభించినప్పుడు కొనే సావరిన్ గోల్డ్ బాండ్‌కు ఎనిమిదేళ్ల వ్యవధితో లభిస్తుంది. అయితే సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నవారు ముందుగానే సెకండరీ మార్కెట్లో అమ్మేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. అందుకే సెకండరీ మార్కెట్లో డిస్కౌంట్లో ఈ బాండ్స్ లభిస్తాయి. తాము కొన్న గోల్డ్ బాండ్స్‌పై మంచి లాభాలు వచ్చినా, అత్యవసరంగా డబ్బులు అవసరమైనా గోల్డ్ బాండ్స్ అమ్మేస్తుంటారు. మీరు మెచ్యూరిటీ వరకు గోల్డ్ బాండ్స్ హోల్డ్ చేస్తారనుకుంటేనే సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనాలి. వేర్వేరు కాల వ్యవధుల్లో మెచ్యూర్ అయ్యే బాండ్స్ సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఒకే బాండ్ ఎక్కువగా కొంటే, మీ బాండ్ మెచ్యూర్ అయ్యేసరికి బంగారం ధర తక్కువగా ఉంటే నష్టపోవాల్సి వస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్‌ను మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తే ప్రతీ ఏడాది 2.5% వడ్డీ చొప్పున లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో అప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంటే అంత చెల్లిస్తుంది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)