Gold Price Today | ఇటీవల భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలపై కరోనా వ్యాక్సిన్ దెబ్బ కొట్టింది. రష్యాలో కరోనా వ్యాక్సిన్ వచ్చేయడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడుతున్నారు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుండటంతో బంగారం, వెండి ధరలు పతనం చూస్తున్నాయి.
1. పసిడిప్రేమికులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు భారీగా దిగొస్తున్నాయి. హైదరాబాద్‌లో గత మూడు రోజుల్లో బంగారం ధర రూ.4,000 పైనే తగ్గితే, వెండి రేటు ఏకంగా రూ.10,000 వరకు తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. అటు మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా ఇదే పరిస్థితి. గత రెండు రోజుల్లో బంగారం ధర రూ.2,000 వరకు తగ్గగా, వెండి రేటు రూ.6,000 పతనమైంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఒక్క రోజులో రూ.3350 తగ్గగా గత మూడు రోజుల్లో రూ.4,020 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.54,680. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర ఒక్కరోజులో రూ.3010 తగ్గగా మూడు రోజుల్లో రూ.3680 ధర తగ్గింది. ప్రస్తుతం 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,140. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
5. హైదరాబాద్‌లో వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలోపై ఒక్కరోజులో రూ.7500 పడిపోయింది. అదే గత రెండు రోజుల్లో చూస్తే కిలో వెండి ధర రూ.10,000 పైనే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.65,010. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
6. ఇక ఎంసీఎక్స్‌లో బంగారం ధర భారీగా పడిపోయింది. గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై ఏకంగా 0.72 శాతం అంటే రూ.377 పతనమై రూ.51,877 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలోపై ఒకేసారి 0.37 శాతం అంటే రూ.250 తగ్గి రూ.66,503 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,928.50 డాలర్లకు కాగా ఔన్స్ వెండి ధర 25.86 డాలర్లకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
9. రష్యాలో కరోనా వ్యాక్సిన్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై ఆశలు పెరుగుతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)