Gold Price Today: బంగారం ధరలు ఢమాల్... ఒక్క రోజులోనే భారీ పతనం
Gold Price Today: బంగారం ధరలు ఢమాల్... ఒక్క రోజులోనే భారీ పతనం
Gold Price Today | బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో పడిపోయాయి. బంగారం మాత్రమే కాదు... వెండి రేటు కూడా ఊహించని స్థాయిలో పడిపోయింది. లేటెస్ట్ రేట్స్ తెలుసుకోండి.
1. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజులోనే బంగారం ధరలు పతనం అయ్యాయి. ఒక్క రోజులోనే రూ.2,000 పైనే తగ్గింది గోల్డ్ రేట్. వెండి కూడా ఊహించని పతనాన్ని చూసింది. ఒక్క రోజులో రూ.6,000 పైనే వెండి రేటు తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్-MCX లో ఫిబ్రవరి ఫ్యూచర్స్ బంగారం ధర 10 గ్రాములపై 4.10 శాతం అంటే రూ.2,086 పతనమైంది. ప్రస్తుతం రూ. 48,818 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. ఇక ఎంసీఎక్స్‌లో మార్చి ఫ్యూచర్స్ కిలో వెండి ధర ఏకంగా 8.74 శాతం అంటే రూ.6,112 పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి రూ.63,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. ఎంసీఎక్స్‌లో బంగారం ధర ఈ స్థాయిలో పడిపోవడం చాలా అరుదు. ఒక్కరోజులో బంగారం ధర రూ.2,000 పైన, వెండి ధర రూ.6,000 పైన పడిపోవడం మార్కెట్లో కలకలం రేపుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ బంగారం, వెండి ధరలు భారీగా పతనయ్యాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,851 డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.50 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. ఇక హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.47,510 కాగా, 24 క్యారట్ బంగారం ధర రూ.51,810. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి లాంటి మెటల్స్ వైపు మొగ్గు చూపట్లేదు. దీంతో డిమాండ్ తగ్గి ధరలు దారుణంగా పతనమయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్ 10 ధర ఫిక్స్ చేసింది. జనవరి 11 నుంచి 15 వరకు గ్రాముకు రూ.5,104 చొప్పున గోల్డ్ బాండ్స్ అమ్మనుంది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)