Gold Price: పెళ్లిళ్ల సీజన్‌కు ముందు గుడ్ న్యూస్... బంగారం ధర ఎంత తగ్గిందంటే
Gold Price: పెళ్లిళ్ల సీజన్‌కు ముందు గుడ్ న్యూస్... బంగారం ధర ఎంత తగ్గిందంటే
Gold Price | పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. అంతకన్నా ముందే సామాన్యులకు బంగారం ధర విషయంలో ఊరట కలిగింది. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఫిబ్రవరిలో ఇప్పటివరకు గోల్డ్ రేట్ ఎంత తగ్గిందో తెలుసుకోండి.
1. గతేడాది బంగారం ధర ఏ స్థాయిలో పెరిగిందో... ఇటీవల గోల్డ్ రేట్ అంతే స్థాయిలో పతనం అవుతోంది. గతేడాది ఆగస్టులో గరిష్ట ధరలతో పోలిస్తే రూ.10,000 కన్నా ఎక్కువే గోల్డ్ రేట్ తగ్గడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. గతేడాది ఆగస్ట్ 7న హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.59,130 కాగా ప్రస్తుతం రూ.47,190. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వచ్ఛమైన బంగారం ధర రూ.11,940 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. ఇక ఆగస్ట్ 7న హైదరాబాద్‌లో 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.54,200 కాగా ప్రస్తుత ధర రూ.43,260. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర రూ.10,940 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. ఫిబ్రవరిలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఫిబ్రవరి 1న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.49,640. ప్రస్తుత ధర రూ.47,190. ఫిబ్రవరిలోనే స్వచ్ఛమైన బంగారం ధర రూ.2450 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. ఇక ఫిబ్రవరి 1న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.45,500. ప్రస్తుత ధర రూ.43,260. ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర ఫిబ్రవరిలో రూ.2240 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. త్వరలో పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం ముందుగానే గోల్డ్ కొనేవాళ్లు ఉంటారు. ఇప్పుడు ధర భారీగా తగ్గడంతో బంగారు ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. గతేడాది కొండెక్కిన గోల్డ్ రేట్ ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కన్నా ముందు తగ్గడం సామాన్యులకు ఊరటే. వెండి ధర దిగిరాకపోయినా గోల్డ్ ధర తగ్గడం సామాన్యులకు శుభవార్తే. పెళ్లిళ్లకు తప్పనిసరిగా గోల్డ్ కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. అయితే బంగారం ధర పతనం ఎంతవరకు అని ఎవరూ అంచనా వేయలేరు. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. పెట్టుబడి కోసం గోల్డ్ కొనాలనుకుంటే ఇప్పటి నుంచే కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం సరైన వ్యూహం. (ప్రతీకాత్మక చిత్రం)