Gold Price Today: ధంతేరాస్ ముందు బంగారం ధరలు ఢమాల్... ఒక్క రోజులోనే రూ.1500 పతనం
Gold Price Today: ధంతేరాస్ ముందు బంగారం ధరలు ఢమాల్... ఒక్క రోజులోనే రూ.1500 పతనం
Gold Rate Today | మరో మూడు రోజుల్లో ధంతేరాస్ జరుపుకోబోతోంది భారతదేశం. ఇంతలో బంగారం ధరలు భారీగా పడ్డాయి. ఈ ఒక్కరోజే గోల్డ్ రేట్ రూ.1500 తగ్గడం విశేషం. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు తెలుసుకోండి.
1. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు అంతే స్థాయిలో దిగివస్తున్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం అవుతున్నాయి. హైదరాబాద్‌లో బంగారం ఒక్క రోజే రూ.1500 తగ్గగా, వెండి ఏకంగా రూ.4,000 పైనే పతనం అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. హైదరాబాద్‌లో మంగళవారం ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ.1500 తగ్గింది. ఏకంగా రూ.48,600 నుంచి రూ.47,100 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. ఇక స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై ఏకంగా రూ.1,640 తగ్గింది. ధర రూ.53,020 నుంచి రూ.51,380 ధరకు దిగొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. వెండి ధర కూడా అదే స్థాయిలో పతనమైంది. మంగళవారం కిలో వెండిపై ఏకంగా రూ.4,400 తగ్గింది. ధర రూ.65,400 నుంచి రూ.61,000 ధరకు దిగొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. నవంబర్ 13న ధంతేరాస్ పర్వదినం జరుపుకోబోతున్నారు. ధంతేరాస్, దీపావళి సందర్భంగా బంగారం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. నగల షాపులు కిటకిటలాడుతుంటాయి. సరిగ్గా ఇదే టైమ్‌లో బంగారం, వెండి ధరలు తగ్గడం కస్టమర్లకు గుడ్ న్యూసే. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. ఇక మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరిగాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.19 శాతం అంటే రూ.592 పెరిగి రూ.50,340 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.80 శాతం అంటే రూ.1,096 పెరిగి రూ.61,950 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం సాధించడంతో పాటు, ఫైజర్ కంపెనీ కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై పాజిటీవ్‌గా ప్రకటన చేయడంతో బంగారం, వెండి ధరలు పతనం అవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)