1. దీపావళి సీజన్లో బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ రేట్ (Gold Rates) భారీగా తగ్గింది. సెప్టెంబర్ చివరి నుంచి నవరాత్రి సందర్భంగా బంగారం ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ రెండు రోజులుగా బంగారం ధరలు (Gold Prices) పతనం అయ్యాయి. రెండు రోజుల్లో ఏకంగా బంగారం ధర రూ.1,000 పైనే పతనం అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై అక్టోబర్ 10న రూ.270, అక్టోబర్ 11న రూ.770 తగ్గింది. రెండు రోజుల్లో రూ.1,040 తగ్గింది. ఇక 22 క్యారట్ గోల్డ్ ధర అక్టోబర్ 10న రూ.250, అక్టోబర్ 11న రూ.700 తగ్గింది. రెండు రోజుల్లో రూ.950 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.51,160 కాగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.46,900. (ప్రతీకాత్మక చిత్రం)
3. బంగారం ధరలు మాత్రమే కాదు, వెండి ధరలు కూడా ఇలాగే పతనం అవుతున్నాయి. రెండు రోజుల్లో కిలో వెండి ధర రూ.2,000 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.64,000. బంగారం, వెండి ధరల పతనం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. నెలల వారీగా చూస్తే ఈ ఏడాది మే నుంచి బంగారం ధరలు ప్రతీ నెలా తగ్గుతూనే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. చెన్నైలో 24 క్యారట్ గోల్డ్ ధర రూ.51,710 కాగా, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.47,400. ముంబై, కోల్కతాలో 24 క్యారట్ గోల్డ్ ధర రూ.51,160 కాగా, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.46,900. న్యూఢిల్లీలో 24 క్యారట్ గోల్డ్ ధర రూ.51,330 కాగా, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.47,050. బెంగళూరులో 24 క్యారట్ గోల్డ్ ధర రూ.51,220 కాగా, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.46,950. (ప్రతీకాత్మక చిత్రం)
5. బంగారం ధరలు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, ఇతర ఛార్జీల కారణంగా విలువైన ధర రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది.బంగారంతో చేసిన ఆభరణాల విషయంలో ధరలు ఎక్కువగా ఉంటాయి. మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ లాంటివి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చూస్తే ఔన్స్ బంగారం ధర1665.10 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 19.41 డాలర్లు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేటును పెంచే అవకాశం ఉన్నందున అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బలహీనంగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)