1. ఫిబ్రవరి చివరి వారం నుంచి వరుసగా పెరుగుతున్న గోల్డ్ రేట్ మళ్లీ తగ్గుతోంది. 10 రోజుల పాటు పెరిగిన బంగారం ధరలు మూడు రోజులుగా మళ్లీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.56,000 మార్క్ దిగువకు చేరగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రూ.51,000 మార్క్ దిగువకు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. హైదరాబాద్లో స్వచ్ఛమైన బంగారం ధర చూస్తే 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.55,630 నుంచి రూ.55,530 ధరకు చేరుకుంది. గత మూడు రోజుల్లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.1020 తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా మూడు రోజులుగా తగ్గుతోంది. గురువారం కిలో వెండిపై రూ.100 తగ్గడంతో రూ.67,500 ధరకు చేరుకుంది. గత మూడు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ.3,200 ధర తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)