2. గురువారం హైదరాబాద్లో బంగారం ధరలు తగ్గాయి. లేటెస్ట్ రేట్స్ చూస్తే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ.46,850 నుంచి రూ.46,700 ధరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.160 తగ్గి రూ.51,110 ధర నుంచి రూ.50,950 ధరకు చేరుకుంది. స్వచ్ఛమైన బంగారంతో పాటు, ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రేట్ స్వల్పంగా తగ్గడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
3. హైదరాబాద్లో బంగారం ధరలు మాత్రమే కాదు, వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.64,500 నుంచి రూ.64,000 ధరకు చేరుకుంది. గత నెలలో వెండి ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న కిలో వెండి ధర రూ.67,000 దగ్గర ఉండగా ఇప్పుడు రూ.3,000 తక్కువకే వెండి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. దేశీయ మార్కెట్లో మాత్రమే కాదు మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.58 శాతం అంటే రూ.296 తగ్గి రూ.50,310 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.21 శాతం అంటే రూ.713 తగ్గి రూ.58,077 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,637.60 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 19.41 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. గత నెలతో పోలిస్తే గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. అయితే వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి ఔన్సు బంగారం ధర 1,830 డాలర్లకు చేరవచ్చని ఇటీవల నిపుణులు ఓ నివేదికలో వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక ధంతేరాస్, దీపావళి సందర్భంగా భారతదేశంలో బంగారం అమ్మకాలు జోరుగా జరిగాయి. గతేడాదితో పోలిస్తే బంగారు నగలు, వెండి వస్తువులు, వజ్రాల ఆభరణాల అమ్మకాలు 35 శాతం పెరిగినట్టు వ్యాపారులు వెల్లడించారు. ధంతేరాస్ సందర్భంగా రెండు రోజుల్లో రూ.19,500 కోట్ల విలువైన 39 టన్నుల బంగారాన్ని అమ్మారు వ్యాపారులు. (ప్రతీకాత్మక చిత్రం)