3. హైదరాబాద్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే, వెండి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం కిలో వెండిపై రూ.400 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.66,700 దగ్గర అందుబాటులో ఉంది. శనివారం రోజు హైదరాబాద్లో వెండి ధర రూ.1,900 పెరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 4 నుంచి వెండి ధర కిలోపై రూ.2,700 పెరిగింది. అంతకన్నా ముందు రెండు రోజుల్లో కిలో వెండి ధర రూ.1,000 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. దేశీయ మార్కెట్లోనే కాదు మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.2 తగ్గి రూ.50,925 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.12 పెరిగి రూ.60,885 దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి ధర రూ.60,000 మార్క్ పైన కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. దీపావళి సీజన్ ముగిసింది. ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతోంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం, మళ్లీ శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లు, ఫంక్షన్లు లక్షల్లో జరగనున్నాయి. రాబోయే 40 రోజుల్లో 30 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. ఈ సీజన్లో బంగారు నగల కొనుగోళ్లు పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)