GOLD PRICE FALLS IN HYDERABAD AND MCX KNOW LATEST GOLD AND SILVER RATES SS
Gold Price Today: బంగారం, వెండి రేట్లు ఢమాల్... ఇవాళ్టి ధరలు ఇవే
Gold Rate Today | పసిడిప్రేమికులకు గొప్ప శుభవార్త. బంగారం ధర పడిపోయింది. వరుసగా రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. వెండి కూడా అంతే. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో, రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
1. వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు రెండు రోజులుగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో వరుసగా రెండు రోజులు బంగారం ధరలు తగ్గడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.49,000 ధరకు దిగొచ్చింది. 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై గురువారం ఒక్క రోజే రూ.360 తగ్గింది. బుధవారం రూ.70 తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.49,090. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. ఇక రూ.54,000 వైపు దూసుకెళ్లిన స్వచ్ఛమైన బంగారం ధర కూడా భారీగానే తగ్గింది. గురువారం రోజు 10 గ్రాముల 24 క్యారట్ బంగారంపై రూ.400 తగ్గింది. బుధవారం రూ.70 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.53,550. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పతనమైంది. గురువారం ఒక్క రోజే కిలోపై రూ.1200 తగ్గడం విశేషం. బుధవారం రూ.500 తగ్గింది. అంటే రెండు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ.1700 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.67,800. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
5. దేశీయ మార్కెట్లోనే కాదు, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. గురువారం నాడు గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా తగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
6. ఎంసీఎక్స్‌లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములపై 0.66 శాతం అంటే రూ.344 తగ్గి రూ.51,480 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. ఇక సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో ధర 1.30 శాతం అంటే రూ.895 తగ్గి రూ.67,886 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,945.00 డాలర్లు కాగా ఔన్స్ వెండి ధర 26.91 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
9. వడ్డీ రేట్లను 2023 వరకు సున్నా స్థాయిలో ఉంచాలని ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)