1. నవంబర్‌లో మొదటి రెండువారాల్లో భారీగా పెరిగిన బంగారం ధర (Gold Rate) గత నాలుగు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతుండటం పసిడిప్రేమికులకు ఊరటనిస్తోంది. పెరిగినప్పుడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్, తగ్గేప్పుడు మాత్రం స్వల్పంగానే తగ్గుతోంది. గత నాలుగు రోజుల్లో రూ.400 పైనే బంగారం ధర తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. మంగళవారం హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ్టి ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ.48,500 నుంచి రూ.48,350 ధరకు చేరుకుంది. గత నాలుగు రోజుల్లో 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.400 తగ్గింది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.170 తగ్గి రూ.52,920 నుంచి రూ.52,750 ధరకు చేరుకుంది. స్వచ్ఛమైన బంగారం ధర మూడు రోజుల్లో రూ.430 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. నవంబర్ 4 నుంచి బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 4న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా ప్రస్తుతం రూ.48,350 ధరకు చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్‌పై రూ.2,250 పెరిగింది. ఇక నవంబర్ 4న 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,290 ఉండగా ప్రస్తుతం రూ.52,750 ధరకు చేరుకుంది. స్వచ్ఛమైన బంగారంపై రూ.2,460 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)