1. ధంతేరాస్, దీపావళి సీజన్ ముగిసింది. ఫెస్టివల్ సీజన్ ఇలా ముగియగానే బంగారం ధరలు తగ్గాయి. ధంతేరాస్కు ఒకరోజు ముందు బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ధంతేరాస్ రోజున గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది. ఇక దీపావళి రోజు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ దీపావళి మరుసటి రోజు గోల్డ్ రేట్ తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.160 తగ్గి ధర రూ.47,010 నుంచి రూ.46,850 వరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.180 తగ్గడంతో ధర రూ.51,290 నుంచి రూ.51,110 వరకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చూస్తే ఔన్స్ బంగారం ధర 1,652.70 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 19.39 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. గత వారంతో పోలిస్తే గ్లోబల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. భవిష్యత్తులో కూడా బంగారం, వెండి ధరలు పెరుగుతాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక ధంతేరాస్ రోజున ఇండియాలో రికార్డు స్థాయిలో బంగారం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 22, 23 తేదీల్లో రూ.25 వేల కోట్లకు పైగా బంగారం, వెండి అమ్ముడుపోయిందని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్, బంగారు ఆభరణాలు, నగలు, వస్తువులు, వెండి వస్తువులు ఉన్నాయి. దీపావళి రోజు అమ్మకాలు ఎలా ఉన్నాయో లెక్కలు రావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)