1. నవంబర్ నుంచి భారీగా పెరిగిన బంగారం ధర (Gold Rate) ఫిబ్రవరిలో భారీగా తగ్గింది. అయితే ఫిబ్రవరి చివరి వారం నుంచి మళ్లీ గోల్డ్ రేట్ పెరుగుతోంది. గత 10 రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. 10 రోజుల తర్వాత గోల్డ్ రేట్ మళ్లీ తగ్గింది. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.56,000 మార్క్ పైన ఉండగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రూ.52,000 మార్క్‌కు దగ్గర్లో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర చూస్తే 10 గ్రాముల ధర రూ.200 తగ్గి రూ.56,550 నుంచి రూ.56,350 ధరకు చేరుకుంది. గత 10 రోజుల్లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.330 పెరిగింది. మరోవైపు వెండి ధర తగ్గుతూ, పెరుగుతూ ఉంది. మంగళవారం కిలో వెండిపై రూ.600 తగ్గడంతో రూ.70,000 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)