Gold Rates: కరోనావైరస్ రెండవ వేవ్ అవకాశం ఉన్నందున, పెట్టుబడిదారులు ఇప్పుడు డాలర్లలో సురక్షితమైన పెట్టుబడి కొనుగోళ్లను ప్రారంభించారు. అందుకే యుఎస్ డాలర్లో ఒక్క సారిగా బలం పుంజుకుంది. ఈ ప్రభావం బంగారం (Gold) , వెండి ధరలపై డైరక్టుగా చూపుతోంది. మంగళవారం తరువాత, బంగారం(Gold) ధరలు కూడా బుధవారం తగ్గాయి. ఎంసిఎక్స్లో బంగారం అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.4 శాతం పడిపోయి 50,180 కు చేరుకోగా, వెండి ఫ్యూచర్స్ 1.6 శాతం పడిపోయి కిలోకు 60,250 రూపాయలకు చేరుకుంది. ఈ వారం, విలువైన లోహాల ధరలు బాగా తగ్గాయి. అంతకుముందు సెషన్లో బంగారం ధరలు 100 రూపాయలు, సోమవారం బంగారం ధరలు 1,200 రూపాయలు తగ్గాయి.