కొత్త ఏడాది ఆరంభంలోనే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వు అందరి అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేటును పెంచిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫెడ్ రేటు 25 బేసిస్ పాయింట్ల పెంపుతో 4.5 నుంచి 4.75 శాతానికి చేరిందని తెలిపారు. ధరల ఒత్తిడి తగ్గిందని, అందుకని రానున్న కాలంలో వడ్డీ రేటు పెంపు నెమ్మదించొచ్చనే సంకేతాలు ఇచ్చింది.